Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పెళ్లెప్పుడని అడిగిన విలేకరిపై అంతెత్తున లేచిన నటి టబూ!

  • పలు తెలుగు చిత్రాల్లో నటించిన టబు
  • ఓ ఇంటర్వ్యూలో పెళ్లి ప్రస్తావన తెచ్చిన మీడియా
  • అసహనాన్ని వ్యక్తం చేసిన టబు
'నిన్నే పెళ్లాడతా' వంటి సూపర్ హిట్ చిత్రంతో పాటు ఎన్నో తెలుగు చిత్రాల్లో నటించిన హీరోయిన్ టబూ, ఓ తాజా ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి ప్రశ్న అడిగిన విలేకరిపై అంతెత్తున లేచింది. తాను ఒంటరిగానే ఉంటున్నానని, పెళ్లి చేసుకోనందుకు ఏ మాత్రమూ బాధపడటం లేదని 46 ఏళ్ల ఈ సీనియర్ నటి వ్యాఖ్యానించింది.

తానిప్పుడు ప్రతి క్షణాన్నీ ఆనందంగా గడుపుతున్నానని, తానింకా వైవాహిక జీవితం గడపలేదు కాబట్టి, పెళ్లయితే బాగుంటుందా? కాకుంటేనే బాగుంటుందా? అన్న విషయాన్ని చెప్పలేనని అంది. ఆపై భవిష్యత్తులోనైనా పెళ్లి చేసుకుంటారా? అని మరో విలేకరి అడుగగా, మరింత ఘాటుగా సమాధానం చెప్తూ, మీతో వచ్చిన చిక్కే ఇదని, అందుకే మీడియాతో తాను మాట్లాడనని అసహనాన్ని వ్యక్తం చేసింది.
Tabu
Media
Marriage
Angry

More Telugu News